Business - Telangana Muchatlu

వాట్సప్‌లో వాయిస్‌ ఇక టెక్ట్స్‌ రూపంలో.. ఈ యూజర్లకు మాత్రమే!
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

వాట్సప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో వాయిస్‌ చాట్‌ను టెక్ట్స్‌ రూపంలో చదువుకోవచ్చు.

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొత్తగా మరో ఫీచర్‌ తీసుకొచ్చింది. మెసేజింగ్‌ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తూ వాయిస్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌ ఫీచర్‌ను  ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో మనకొచ్చే వాయిస్‌ మెసేజ్‌ టెక్ట్స్‌ రూపంలో కనిపిస్తుంది. ఆడియో సందేశం వినలేని సందర్భాల్లో, అవతలి వ్యక్తి పంపించిన సందేశాన్ని టెక్ట్స్‌ రూపంలో రాసుకోవాల్సిన సందర్భంలో ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

ప్రస్తుతానికి ఇంగ్లిష్‌, హిందీతో పాటు స్పానిష్‌, పోర్చుగీసు, రష్యన్‌ భాషలకు కొత్త ఫీచర్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫీచర్‌ యాక్టివేట్‌ చేయడానికి వాట్సప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి చాట్స్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. అక్కడ ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చుంటే ట్రాన్‌స్క్రిప్షన్‌ ఆఫ్‌/ ఆన్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకసారి యాక్టివేట్‌ చేసుకున్నాక వచ్చిన వాయిస్‌నోట్స్‌ను అక్షర రూపంలోకి మార్చుకోవడానికి దాని కిందే ఓ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కొందరికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి రాగా.. త్వరలో అందరూ వినియోగించడానికి వీలవుతుంది. వాట్సప్‌ వెబ్‌ వెర్షన్‌లో ఈ ఆప్షన్‌ కనిపించదు.

రియల్‌మీ తన సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేయనుంది
హైదరాబాద్ తెలంగాణ ముచ్చట్లు:

320W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కంపెనీ రూపొందించింది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే ఫోన్ పూర్తి ఛార్జ్ కానుంది.ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ తన కొత్త సూపర్‌సోనిక్ ఛార్జ్ టెక్నాలజీని రేపే ప్రారంభించబోతోంది. ఈ టెక్నాలజీతో కేవలం ఐదు నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ ఛార్జింగ్‌ టెక్నాలజీ. దీన్ని కంపెనీ రేపు (ఆగస్టు 14వ తేదీ) తీసుకురానుంది. ఇంతకుముందు కంపెనీ 300W ఫాస్ట్ ఛార్జింగ్‌ను తీసుకురాబోతోందని అందరూ భావించారు. అయితే 320W సూపర్‌ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీని తీసుకురాబోతున్నట్లు రియల్‌మీ తెలిపింది. ఈ టెక్నాలజీ రాకతో స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ చేయడం చాలా వేగవంతం కానుంది.

రియల్‌మీ రూపొందించిన ఈ ఫాస్ట్ ఛార్జర్ గత సంవత్సరం తమ కంపెనీనే ప్రవేశపెట్టిన 240W ఫాస్ట్ ఛార్జ్‌కు టెక్నాలజీ పరమైన అప్‌డేట్ నవీకరణ. రియల్‌మీ గత ఏడాది లాంచ్ చేసిన జీటీ 5 మొబైల్‌తో ఈ ఛార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 80 సెకన్లలోనే 20 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

స్మార్ట్‌ ఫోన్‌ పోతే.. యూపీఐ ఐడీల పరిస్థితి ఏంటి.?
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్‌ కచ్చితంగా ఉండే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు పెరిగిన తర్వాత స్మార్ట్‌ ఫోన్‌ లేనిది రోజు గడవని పరిస్థితి వచ్చింది. అయితే ప్రతీ రోజూ వేలల్లో లావాదేవీలు చేసే యాప్స్‌ఉండే ఫోన్‌ ఎక్కడైనా పడిపోయినా, లేదా ఎవరైనా దొంగలించినా అప్పుడు పరిస్థితి ఏంటి.? ఈ సందేహం ఎప్పుడైనా వచ్చిందా.? ఒకవేళ నిజంగానే మీ ఫోన్‌ పోయిందనుకోండి. మీ ఫోన్‌లోని యూపీఐ ఐడీలను బ్లాక్‌ చేసే అవకాశం ఉంటుంది
ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్‌పే వంటి ఎన్నో రకాల యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరి వీటిని బ్లాక్‌ ఎలా చేయాలి.? మన దగ్గర ఫోన్‌ ఉంటే ఇట్టే యాప్స్‌ను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఫోన్‌ లేకపోతే పరిస్థితి ఏంటి.? ఇందుకోసం కూడా ఓ మార్గం ఉంది. యూపీఐ ఐడీని నిమిషాల్లోనే సులభంగా బ్లాక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని టోల్‌ ఫ్రీ నెంబర్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటికి కాల్‌ కాసి కొన్ని వివరాలు తెలిజేయడం ద్వారా మీరు మీ యూపీఐ ఐడీని బ్లాక్‌ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో హ్యాకింగ్ కూడా ఎక్కువవుతోంది. యూపీఐ ఐడీలను హ్యాక్‌ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారు కూడా ఈ నెంబర్లకు కాల్ చేసిన యూపీఐ ఐడీని బ్లాక్‌ చేసుకుకోవచ్చు.

ఎలా బ్లాక్‌ చేయాలంటే..

ఒకవేళ మీరు గూగుల్ పే ఉపయోగిస్తున్నట్లయితే.. మీరు 1800-419-0157 నెంబర్‌కు కాల్‌ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా పేటీఎమ్‌ ఉపయోగిస్తున్నట్లయితే 01204456456 నెంబర్‌కు కాల్‌ చేయాలి. ఇవి టోల్‌ ఫ్రీ నెంబర్స్‌. ఈ నెంబర్లకు కాల్ చేసిన తర్వాత కస్టమర్ కేర్‌ ప్రతినిధులతో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో సదరు యూపీఐ ఐడీ మీదేనా కాదా.? అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి అవతలివైపు నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి సమాధానాలు చెప్పడం ద్వారా మీ యూపీఐ ఐడీని సులభంగా బ్లాక్‌ చేసుకోవచ్చు.

బ్యాంకింగ్‌ చట్టాల్లో సవరణలు చేస్తాం..
డెస్క్ ,తెలంగాణ ముచ్చట్లు:

చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్యాంకింగ్‌ చట్టాల్లో (Banking Acts) సవరణలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitaraman) అన్నారు. అదేవిధంగా నామినీ చట్టాల్లో కూడా మార్పులు తీసుకువస్తామని ఆమె ప్రకటించారు. ఈ మార్పుల ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థ కస్టమర్‌ ఫ్రెండ్లీగా మారుతుందని చెప్పారు.

శనివారం ఢిల్లీలో జరిగిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ల సమావేశంలో నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకులకు ఆమె పలు సూచనలు చేశారు. అన్ క్లెయిమ్డ్‌ డిపాజిట్లపై దృష్టి సారించాలని సూచించారు. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉన్నాయని అన్నారు. కాగా అనేక ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయించారు.

ఈ క్రమంలోనే శుక్రవారం లోక్‌సభలో బ్యాంకింగ్ చట్టాల సనవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలోని బ్యాంకుల వద్ద ప్రజలకు సంబంధించిన అన్ క్లెయిమ్డ్‌ డిపాజిట్లు పెరగటంపై కూడా మోదీ సర్కార్ దృష్టి సారించింది. రిజర్వు బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం మార్చి 31, 2024 చివరి నాటికి వార్షిక ప్రాతిపదికన బ్యాంకుల వద్ద ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము 26 శాతం పెరిగి రూ.78,213 కోట్లకు చేరుకుంది.

ఈ నేపథ్యంలోనే ఒక ఖాతాకు కస్టమర్లు నలుగురు నామినీలను ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని బ్యాంకింగ్ చట్టాల సనవరణ బిల్లు 2024 నిర్ణయించింది. దీనికి ముందు వరకు ఒక ఖాతాకు కేవలం ఒక నామినీని మాత్రమే కస్టమర్లు ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉండేది. కొత్త చట్టాలు అమలులోకి వస్తే తదనుగుణంగా నామినీలను వినియోగదారులు పెంచుకోవచ్చు.

ఈ మార్పు ద్వారా సదరు ఖాతాదారులు మరణిస్తే డిపాజిట్లు లేదా ఇతర మెుత్తాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి చట్టపరంగా నామినీలకు అవకాశం కల్పించబడుతుంది. దాంతో భారీగా పెరుగుతున్న అన్ క్లెయిమ్డ్ డిపాజిట్‌లకు అడ్డుకట్ట వేయవచ్చు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఏకకాలంలో 4 చట్టాలను సవరించేందుకు ప్రయత్నించటాన్ని ఆర్ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.

AI ఎఫెక్ట్‌.. సిస్కోలో వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. ఆరు నెలల్లో రెండో సారి..!
డెస్క్ తెలంగాణ ముచ్చట్లు :

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థల్లో లేఆఫ్స్‌ (Layoffs) పర్వం కొనసాగుతోంది. మాంద్యం భయాల కారణంగా ఇప్పటి వరకూ వందలాది సంస్థలు ఉద్యోగులను తొలగించాయి. అయితే, ఇప్పుడు ఏఐతో పాటు ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌పై దృష్టి సారించే క్రమంలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటికే పలు సంస్థలు ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించాయి. రెండు రోజుల క్రితం డెల్‌ టెక్నాలజీస్‌ కూడా భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని ఏకంగా 12500 మందిని డెల్‌ విధుల నుంచి తొలగించింది.

ఇప్పుడు మరో సంస్థ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ కంపెనీ సిస్కో (Cisco Layoffs) భారీగా కొలువుల కోత‌కు ప్రణాళిక‌లు రూపొందిస్తున్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో ఉద్యోగుల‌ను తొల‌గిస్తూ వ్యాపార పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌కు పూనుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో దాదాపు 4,000 మందికి లేఆఫ్‌లు ప్రకటించిన ఈ సంస్థ తాజాగా అదే సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైనట్లు (second round of layoffs) తెలిసింది. ఆరు నెలలు గడవకముందే మళ్లీ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

వ్యాపారంలో డిమాండ్ తగ్గడం, సరఫరా చైన్‌లో సమస్యల కారణంగానే కంపెనీ ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటోంది. మరోవైపు 2025 నాటికి ఏఐ ఉత్పత్తుల ఆర్డర్‌లో బిలియన్‌కు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఉద్యోగులను తగ్గించుకొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు రాయిటర్స్‌ నివేదించింది. కాగా, సిస్కోలో ప్రపంచ‌వ్యాప్తంగా 84,900 మంది ప‌నిచేస్తున్నట్లు అంచనా. తాజా కొలువుల కోతతో ఈ సంఖ్య భారీగా త‌గ్గనుంది.

పిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీని పెంచిన ప్రభుత్వ రంగ బ్యాంకులు..!
డెస్క్,తెలంగాణ ముచ్చట్లు:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానకమిటీ అనంతరం రెపోరేటు యథాతధంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. రేపో రేటు 6.5శాతంగా ఉంటుందని పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయకపోవడం ఇది వరుసగా తొమ్మిదవసారి కావడం విశేషం. చివరిసారిగా గతేడాది ఫిబ్రవరి మాసంలో రెపోరేటును పెంచిన విషయం తెలిసిందే. మరో వైపు రెపోరేటు యథావిధిగా కొనసాగిస్తూ వస్తున్నా.. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం ఇటీవల కాలంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీని చాలాసార్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం గరిష్ఠంగా 7.40శాతానికి పెంచాయి. ప్రధాన బ్యాంకుల్లో ఒకటైనా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 399 రోజుల డిపాజిట్‌ స్కీమ్‌పై 7.25 శాతం వడ్డీని చెల్లిస్తున్నది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 666 రోజుల డిపాజిట్లపై 7.30 శాతం వడ్డీని, 777 రోజుల డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.25 శాతం వడ్డీని, 444 రోజుల డిపాజిట్లపై కెనరా బ్యాంక్ 7.25 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు

ఇక సెంట్రల్ బ్యాంక్ 444 రోజుల డిపాజిట్లపై 7.30శాతం, ఇండియన్ బ్యాంక్ 444 రోజుల డిపాజిట్లపై 7.25 నుంచి వడ్డీని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 333 రోజుల డిపాజిట్‌ స్కీమ్‌పై 7.40 శాతం వడ్డీని చెల్లిస్తున్నది. గత రెండు నెలల్లో చాలా ప్రభుత్వ బ్యాంకులు ఎఫ్‌డీ, రుణాలు రెండింటిపై వడ్డీ రేట్లను పెంచాయి. అయితే, డిపాజిట్‌ కంటే బ్యాంకుల రుణాల రేటు పెరుగుతున్నది. దీంతో బ్యాంకుల నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల రుణాల వృద్ధిరేటు 16శాతం కాగా.. డిపాజిట్ల వృద్ధి రేటు 10శాతంగా నమోదైంది. డిపాజిట్ల సమస్యను పరిష్కరించాలని ఆర్‌బీఐ గురువారం బ్యాంకులకు సూచించింది. మరో వైపు కెనరా బ్యాంక్‌ అన్ని రుణాలపై వడ్డీని 0.05శాతం పెంచింది. దీంతో గృహ రుణాలు, కన్జ్యూమర్‌ రుణాలు సహా అన్నింటిపై వడ్డీ భారం పడనున్నది. ఏడాది రుణ రేటు 9శాతం, మూడేళ్ల రుణరేటు 9.40శాతం, రెండేళ్ల రుణరేటు 9.30శాతంగా ఉండనున్నది. నెల, మూడునెలలు, ఆరు నెలల రుణ రేటు 8.35శాతం నుంచి 8.80శాతం మధ్య ఉండనున్నది. కొత్త రేట్లు ఈ నెల 12 నుంచి అమలులోకి రానున్నాయి.

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతున్నారా..?
డెస్క్ తెలంగాణ ముచ్చట్లు:

యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్‌ బ్రౌజర్‌లో అనేక బగ్‌లో ఉన్నాయని.. వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెనీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) పేర్కొంది. గూగుల్‌ యూజర్లు క్రోమ్‌ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్‌ చేయాలని సెర్ట్‌ ఇన్‌ సూచించింది. క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్‌లో చాలా లోపాలు ఉన్నాయని.. వాటిని వాడుకొని హ్యాకర్లు సిస్టమ్స్‌ను రిమోట్‌లోకి తీసుకొని నియంత్రించే అవకాశం ఉంటుందని పేర్కొంది.

సిస్టమ్‌లో స్టోర్‌ చేసి పెట్టుకొని కీలకమైన డేటాను కాపీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. సిస్టమ్‌ను రిమోట్‌గా షట్‌డౌన్‌ చేయవచ్చని.. గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో సేవ చేసుకున్న అన్ని పాస్‌వర్డ్‌లను సైతం తస్కరించేందుకు ఛాన్స్‌ ఉందని పేర్కొంది. అంతటితో ఆగకుండా మాల్వేర్‌ను నెట్‌వర్క్‌తో పాటు కంప్యూటర్‌లో చొప్పించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. విండోస్‌, మ్యాక్‌ యూజర్లు తప్పనిసరిగా గూగుల్‌ క్రోమ్‌ 127.0.6533.88/89కి అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. క్రోమ్‌ బ్రౌజర్‌ను ఆటోమేటిక్‌ అప్‌డేట్‌ మోడ్‌లో ఉంచాలని.. తద్వారా ఎప్పటికప్పుడు లోపాలను నివారించవచ్చని చెప్పింది.