పార్టీ జెండా మోసిన వారికే అన్ని పదవులు
జంగా రాఘవ రెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్
బెల్లంపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
బెల్లంపల్లి పట్టణంలోని ఆర్‌పి ఫంక్షన్ హాల్‌లో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
“పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారికే కాంగ్రెస్‌లో అన్ని రకాల పదవులు లభించనున్నాయి,” అని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి కష్టసమయంలో అండగా నిలిచిన కార్యకర్తలే విజయానికి అసలైన బలం అని గుర్తు చేశారు. నిబద్ధత చూపిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలను తెలుసుకొని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత కార్యకర్తలదేనని సూచించారు. గ్రామ, మండల కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
“జై భీమ్ – జై బాపు – జై సంవిధాన్” నినాదాలతో ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. సమావేశంలో కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించబడినాయి.
Comments