భూ భారతి చట్టంతోనే రైతుల భూ సమస్యల పరిష్కారం అవుతుంది 

రామసహాయం రఘురామ్ రెడ్డి

భూ భారతి చట్టంతోనే రైతుల భూ సమస్యల పరిష్కారం అవుతుంది 

సత్తుపల్లి, ఆర్ సి, తెలంగాణ ముచ్చట్లు:

సోమవారం సత్తుపల్లి పట్టణం లో భూ భారతి చట్టంతోనే రైతుల భూ సమస్యల పరిష్కారం అవుతాయని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. 

స్ధానిక పట్టణం లో రాణి సెలబ్రేషన్స్ ఫంక్షన్ హాల్ లో 2025 భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతుల సంక్షేమాభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టం తీసుకువచ్చిందని, భూ వివాదాల సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం ఎంతగానో దోహదపడుతుందని, నూతన చట్టం భూ భారతి గురించి క్లుప్తంగా రైతులకు వివరించారు. ప్రజలకు ఎలాంటి భూ వివాదాలకు తావులేకుండా రైతులకు సంబంధించిన భూముల పై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం పలు కొత్త అంశాలను పొందుపరుస్తూ నూతన ఆర్ ఓ ఆర్ తెచ్చిందన్నారు. ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి చట్టం అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూ భారతి 2025 చట్టంలో చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రభుత్వం ఆధార్ తరహాలో భవిష్యత్తులో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో తీసుకుని రాబోతుందని పేర్కొన్నారు. భూముల రికార్డుల్లో ఏదైనా తప్పులు జరిగి ఉంటే ఈ చట్టం ద్వారా సవరణకు అవకాశం కల్పిస్తారన్నారు. భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎకరాకు రూ.2500 మ్యూటేషన్ రుసుము ఉంటుందన్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న సాదా బైనామాల పరిష్కారం ఈ చట్టం ద్వారా వేగవంతం కావడంతో పాటు, వారసత్వ భూముల మ్యూటేషన్ను గడువులో పూర్తిచేయడం, హక్కుల సంక్రమణను అధికారికంగా నమోదు చేయడం ద్వారా వ్యవస్థ మరింత బలోపేతం, నిబద్ధతతో పని చేస్తుందని ఖమ్మం ఎంపీ, సత్తుపల్లి ఎమ్మెల్యే, ఖమ్మం కలెక్టర్  తెలిపారు. భూసమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ రైతులకు న్యాయబద్ధమైన మార్గం కల్పిస్తోందని తెలిపారు, ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులతో వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, భవిష్యత్తులో పేద రైతులకు ఉచిత న్యాయసహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణను శాస్త్రీయంగా చేస్తూనే, మోసపూరితంగా పొందిన ప్రభుత్వ భూముల పై పట్టాలను రద్దుచేసే అధికారం ఈ చట్టం ద్వారా కల్పించబడిందని, భూభారతి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. గ్రామాల్లో మండల వ్యవసాయాధికారుల సహకారంతో రైతు వేదికల వద్ద రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ఈ చట్టం పై అవగాహన కార్యక్రమాలు చేపడతామని, భూసమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టం పై అవగాహనను ఏర్పరచుకోవాలని, దీనిని వూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కల్లూరు ఆర్ డి ఓ, సత్తుపల్లి ఎం.పి.డి.ఓ, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివ వేణు, దొడ్డా శ్రీనివాసరావు పట్టణం, మండలం కాంగ్రెస్ పార్టీ నాయుకులు చల్లగుండ్ల నరసింహారావు, గ్రామ నాయుకులు, కార్యకర్తలు, రైతులు, రెవున్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-28 at 8.20.18 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......