లాటరీ ద్వారా పారదర్శకంగా మూతబడిన 2 బార్ల కేటాయింపు ఖరారు 

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

లాటరీ ద్వారా పారదర్శకంగా మూతబడిన 2 బార్ల కేటాయింపు ఖరారు 

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

లాటరీ పద్దతి ద్వారా పారదర్శకంగా  జిల్లాలో మూతబడిన 2 బార్ల లైసెన్స్ దారులను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మూతబడిన రెండు బార్ లకు సంబంధించి లైసెన్స్ దారుల ఎంపిక ప్రక్రియలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.  
జిల్లాలో మూతబడిన రెండు 2బీ బార్లకు 112 మంది అభ్యర్థుల ద్వారా 145  దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లాటరీ పద్ధతిన బార్ల లైసెన్స్ దారుల ఎంపిక చేశామని అన్నారు. బార్ల కేటాయింపు మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.   
లాటరీ ద్వారా సీరియల్ నెంబర్ 13 కు సంబంధించి జుట్టుకొండ లక్ష్మీ నారాయణ, సీరియల్ నెంబర్ 135 కు సంబంధించి గుండవరం రాజేశ్వర రావు లను లైసెన్స్ దారులుగా ఎంపిక చేసినట్లు, వీరు ప్రభుత్వం నిర్దేశించిన ఎక్సైజ్ టాక్స్ వెంటనే చెల్లించి కన్ఫర్మేషన్ లెటర్ తీసుకోవాలని సూచించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ జి. జనార్థన్ రెడ్డి,     జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై. వేణుగోపాల్ రెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి. కృష్ణ, ఎక్సైజ్ అధికారులు, దరఖాస్తు దారులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......