శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Views: 0
On
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
నేడు (ఏప్రిల్ 30) ఉదయం 9.00 గంటలకు కలెక్టరేట్ లో నిర్వహించు శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించనున్నట్లు, ఏప్రిల్ 30న ఉదయం 9.00 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారి చిత్రపటానికి పూలమాలాంకరణ జరుగుతుందని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ కులస్థులు, కుల సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 Apr 2025 22:32:34
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
Comments