తాటికాయలలో ఘనంగా బీఆర్ఎస్ 25 వసంతాల  వేడుక

బీఆర్ఎస్ గులాబీ జెండా ఆవిష్కరణ

తాటికాయలలో ఘనంగా బీఆర్ఎస్ 25 వసంతాల  వేడుక

అనంతరం సభలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు
 
ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:
 
భారత రాష్ట్ర సమితి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్  పార్టీ ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య  ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లాల నర్సయ్య గ్రామ పార్టీ శ్రేణుల  సమక్షంలో గులాబీ జెండా ఆవిష్కరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో బహిరంగ సభకు  తరలివెళ్లారు.
 
ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లాల నర్సయ్య, మాజీ ఎంపీటీసీ ననుబాల సోమక్క చంద్రమౌళి మాట్లాడుతూ,
“తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. 25 ఏళ్ల బృహత్తర ప్రయాణంలో ప్రతి కార్యకర్త పాత్ర అపూర్వం. గ్రామస్థులు చూపిస్తున్న మద్దతు వల్ల పార్టీ బలోపేతం మరింత వేగంగా కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ప్రజల సంక్షేమమే మా లక్ష్యంగా ముందుకు సాగుతాం,” అని వారు పేర్కొన్నారు.
 
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి బొల్లెపాక సంపత్, సీనియర్ నాయకులు ఎర్ర అశోక్, పెసరు సంపత్, పట్ల మీస రాజయ్య,ఎర్ర వెంకటస్వామి,కనుకటి రవీందర్,పెసరు సదయ్య తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-27 at 9.29.24 PM
Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......