యరగర్ల పిచ్చయ్య భౌతిక కాయానికి నివాళులర్పించిన యాదవ నాయకులు
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు తండ్రిగారైన యరగర్ల పిచ్చయ్య శనివారం సాయంత్రం వారి నివాసం వివి పాలెం లో అనారోగ్యంతో చనిపోయారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా గౌరవ అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ మరియు యాదవ సంఘం నాయకులు పిచ్చయ్య గారి భౌతిక దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుమారులు హనుమంతరావు నాగరాజు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మనకు జన్మనిచ్చి, తమ జీవితాన్ని ధారపోసి మనలను ఉన్నత స్థితికి చేర్చిన కన్న తండ్రి మరణం తన సంతానానికి ఎంతో వేదన మిగిలిస్తుందని మల్లి బాబు యాదవ్ పిచ్చయ్య మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ ఫతే మహమ్మద్,తోట రామారావు, వాగదాని కోటేశ్వరరావు, శెట్టి రంగారావు, చేతుల నాగేశ్వరావు, మొరిమేకల కోటయ్య పంకు మురళి, పంకు కిషోర్,పంకు అప్పారావు, పంకు నరసింహారావు,పరిటాల భద్రయ్య,వీరబాబు, పల్లపు భద్రం,లింగయ్య,
త దితర యాదవ సంఘం ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు
Comments