పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సన్మాన సభను విజయవంతం చేయండి
ఎమ్మార్పీఎస్ చిల్పూర్ మండల ఇంచార్జ్ గంగారపు శ్రీనివాస్ మాదిగ
– ఎమ్మార్పీఎస్ మండల నాయకులు మట్టెడ అనిల్ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం
చిల్పూర్, తెలంగాణ ముచ్చట్లు:
చిల్పూర్ మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పి అనుబంధ విభాగాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గంగారపు శ్రీనివాస్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“మూడేళ్ల దశాబ్దాలుగా అలుపెరగని సామాజిక ఉద్యమాన్ని నడిపించి, వర్గీకరణ విజయాన్ని సాధించి, పీడిత వర్గాల హక్కులు సాధించిన మహనీయుడు మందకృష్ణ మాదిగ. జాతి ఆత్మగౌరవానికి, ఉద్యమ చైతన్యానికి చిరస్మరణీయ ప్రతీక అయిన ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించడం గర్వకారణం. అలాగే వర్గీకరణ నెరవేరడం పీడిత వర్గాల దీర్ఘకాల ఆకాంక్ష నెరవేరిన ఘట్టం,” అన్నారు.
“ఈ సందర్భంగా మే నెల 2వ వారంలో స్టేషన్ గణపూర్ లో జరుగనున్న మందకృష్ణ మాదిగ సన్మాన సభను ఘనంగా విజయవంతం చేయాలి. చిల్పూర్ మండల పరిధిలో ప్రతి గ్రామాన్నీ, ప్రతి హృదయాన్నీ తట్టి లేపేలా, అన్ని రాజకీయ పక్షాలను, మాదిగ జాతి నాయకులను, ఉద్యమ సంఘాలను ఐక్యపరచి, భారీగా ఈ సభను విజయవంతం చేయాలని” ఆయన పిలుపునిచ్చారు.
“మన వర్గాల భవిష్యత్తు జాతి చైతన్యంపైనే ఆధారపడి ఉంది. అందుకే ప్రతి ఒక్కరు కృషి చేసి, మన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని” గంగారపు శ్రీనివాస్ మాదిగ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఆరూరి ప్రదీప్ కుమార్ (మాజీ సర్పంచ్), కురుసపల్లి శేఖర్, ఆరూరి అశోక్, ఆరూరి బాలస్వామి, ఆరూరి సుకేందర్, పాశం ప్రణయీ, చిట్యాల శ్రీకాంత్, మట్టెడ నవీన్, వినయ్ తదితరులు.
Comments