మహబూబాబాద్ టౌన్ సిఐ 'పెండ్యాల దేవేందర్' కు రివార్డు
డీజీపీ చేతులు మీదుగా రివార్డు అందుకున్న పెండ్యాల దేవేందర్.
పర్వతగిరి,తెలంగాణ ముచ్చట్లు ..వరంగల్ టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహించిన సీ.ఐ పెండ్యాల దేవేందర్ కు మాదకద్రవ్యాలు నిర్మూలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సిఐ పెండ్యాల దేవేందర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు నిర్మూలనలో భాగంగా నాకు అవార్డు రావడం అవార్డుని తెలంగాణ రాష్ట్ర డిజిపి చేతుల మీద నుంచి అందుకోవటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
అలాగే యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి వారి భవిష్యత్తుకు బాటలు వేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పెండ్యాల దేవేందర్ యువతకు సందేశం ఇచ్చారు. సి.ఐ పెండ్యాల దేవేందర్ మాదకద్రవ్యాల నిర్మూలన రివార్డు అందుకున్నందుకు పలువురు ఉన్నత అధికారులు, బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments