ఖమ్మం టాక్స్ ప్రొఫెషనల్స్ కు జీఎస్టీ, ఆదాయపు పన్ను చట్టాలపై సమగ్ర శిక్షణ
విజయవంతమైన వర్క్‌షాప్ ముగింపు
–కె.జి.పి.ఏ అధ్యక్షులు ఉల్లిబోయిన సైదులు
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ మరియు ఖమ్మం డిస్ట్రిక్ట్ జి.ఎస్.టి ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మంలోని వైరా రోడ్డులో గల వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సి (విఐహెచ్ఈ ) నందు జి.ఎస్.టి మరియు ఆదాయపు పన్ను చట్టాలపై సమగ్ర శిక్షణ శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిక్షణ శిబిరం ఏప్రిల్ 21 నుంచి 26 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6:15 నుండి 8:30 గంటల వరకు జరిగింది. మొత్తం పది క్లాసుల ద్వారా 100 మందికి పైగా సభ్యులకు 10 గంటల పాటు శిక్షణ ఇవ్వబడింది.
వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. కె.జి.పి.ఏ అధ్యక్షులు ఉల్లిబోయిన సైదులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎం.వి.జె.కె. కుమార్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ - సౌత్ జోన్, నగేష్ రంగీ సౌత్ జోన్ వైస్ ప్రెసిడెంట్- తెలంగాణ హాజరయ్యారు. ముఖ్య వక్తలుగా నాగేంద్రప్రసాద్ పూర్వ చైర్మన్- ఏఐఎఫ్టిపి -ఎస్ జెడ్, మరియు కోటా సునీల్ కల్చరల్ కమిటీ చైర్మన్ - ఏఐఎఫ్టిపి –ఎస్ జెడ్ పలు ముఖ్యమైన అంశాలపై సభ్యులకు లోతుగా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని సి.హెచ్.వి. కోటేశ్వరరావు, బి. దుర్గాప్రసాద్ మరియు జి. రమేష్ సమన్వయ కర్తలుగా ఉన్నారు, కె.జి.పి.ఏ కార్యవర్గం పూర్తిగా మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. అతిధుల అభిప్రాయాలు ఎం.వి.జె. కుమార్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలోని జి.ఎస్.టి ప్రాక్టీషనర్లు సంఘటితమై వృత్తిలో ముందుకు సాగాలనే సంకల్పం అభినందనీయం అని పేర్కొన్నారు. నరేష్ రంగీ మాట్లాడుతూ, ఈ సమగ్ర శిక్షణ టాక్స్ ప్రొఫెషనల్స్‌కు నైపుణ్యం పెంపొందించడానికి గొప్ప అవకాశమని, వృత్తి పరంగా రాణించేందుకు తోడ్పడుతుందని ప్రశంసించారు. పి.వి. సుబ్బారావు వీడియో మెసేజ్ లో మాట్లాడుతూ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగని స్థాయిలో ఖమ్మం జిల్లా శ్రేష్ఠమైన శిక్షణను అందించిందని అభినందించారు.
విఐహెచ్ఈ అధ్యక్షులు వాసుదేవరావు, ప్రొఫెషనల్స్ తమ సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని సూచించారు. ఈ వర్క్‌షాప్ లో ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన పదిమంది ప్రముఖ నిపుణులు అనేక ఆసక్తికర అంశాలపై ప్రగాఢమైన శిక్షణ అందించారు. . కార్యక్రమ విజయవంతానికి సహకరించిన కె.జి.పి.ఏ కార్యవర్గ సభ్యులు, ఏఐఎఫ్‌టీపీ ప్రతినిధులు, విఐహెచ్ఈ ప్రతినిధులు మరియు ఇతర సభ్యులు అందరికీ అధ్యక్షులు సైదులు , కార్యదర్శి పవన్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కె.జి.పి.ఏ కార్యవర్గం, విఐహెచ్ఈ ప్రతినిధులు, ఏఐఎఫ్‌టీపీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ తరహా వృత్తి శిక్షణ కార్యక్రమం ఖమ్మం జిల్లాలో జరగడం టాక్స్ ప్రొఫెషనల్స్ సమాజానికి గొప్ప ప్రేరణగా నిలిచింది.
Comments