ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం

కాంగ్రెస్ ప్రభుత్వ పునాదుల్లోనే సామాజిక న్యాయం

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం

– స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

మండలంలోని క్యాతంపల్లిలో పేదల ఇంటి కల సాకారమవుతోంది. మార్చి 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలకాన్ని బుధవారం  ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించారు. అనంతరం ఎంపిడివో కార్యాలయ ప్రాంగణంలో నమూనా ఇంటిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ – పేద ప్రజల కలలను రూపం దిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. జనవరి 26న క్యాతంపల్లిని ఫైలెట్ గ్రామంగా ఎంపిక చేసి నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించామన్నారు. 130 మందికి ఇళ్లు మంజూరు కావడంతో పాటు రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా వంటి పథకాల ప్రయోజనాలు అందాయని వివరించారు.

ఇళ్ల నిర్మాణం 600 చదరపు అడుగుల దాకా పరిమితంగా ఉండాలని సూచించిన కడియం, అధికార యంత్రాంగం బ్యాంకు లింకేజీలతో రుణాలు ఇప్పించేందుకు చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కఠినమైనా సంక్షేమ పథకాలపై ఎలాంటి రాజీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.

గత 15 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి శూన్యమైందని, తాను ఎమ్మెల్యే అయిన ఏడాదిలోనే రూ.800 కోట్ల అభివృద్ధి నిధులను సాధించానని తెలిపారు. రైతులకు మద్దతుగా క్వింటాకు రూ.500 బోనస్, ఏడాదిలోనే 21 వేల కోట్ల రుణమాఫీ, ఉచిత కరెంట్, 500కి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

ఇది దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిIMG-20250430-WA0033లుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ, డిఈ, తహసీల్దార్, ఎంపిడివో, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......