రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు చేపట్టాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు చేపట్టాలి

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారుల ఎంపిక తర్వాతనే యూనిట్లకు ప్రభుత్వం నుండి  వచ్చే రాయితీని బ్యాంకు ద్వారా మంజూరు అయ్యేవిధంగా అధికారులు బ్యాంకర్లు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా పి. ప్రావీణ్య అన్నారు.

కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖల అధికారులతో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  జిల్లాలో బిసి, ఎస్సీ, ట్రైబల్, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా దాదాపు 63 కోట్ల రూపాయలను ఈ పథకం ద్వారా జిల్లాలోని వివిధ యూనిట్లను నెలకొల్పేందుకు  లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.  లబ్ధిదారుల ఎంపిక జాబితాను ఎంపీడీవోలు అందజేసేటప్పుడే బ్యాంకు ఖాతాలను కూడా జత చేసి అందించాలన్నారు. మండల స్థాయి ఎంపిక కమిటీ మే 10నాటికి లబ్ధిదారులు ఎంపిక జాబితా ను సమర్పించాలన్నారు. మండల స్థాయిలో ఐదు రోజుల్లో సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకోవాల న్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో ప్రభుత్వ  మార్గదర్శకాలను  పాటించాలని అధికారులకు, బ్యాంకర్లకు సూచించారు.

ఈ సందర్భంగా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక తర్వాత వారు ఎంచుకున్న యూనిట్లకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పథకంపై ఆయా మండలాల పరిధిలోని ఎంపీడీవోలతో బ్యాంకర్లు సమావేశం కావాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, బీసీ వెల్ఫేర్ డీడీ రామ్ రెడ్డి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మురళీధర్ రెడ్డి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ప్రేమకళ, జిల్లా లోని పలువురు బ్యాంకర్లు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......