వరంగల్ రజాతోత్సవ సభకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు

బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం 

వరంగల్ రజాతోత్సవ సభకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు

మళ్లీ గులాబీ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు

-- పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి 

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామం నుండి మాజీ జడ్పిటిసి  రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఆదివారం ఉదయం గ్రామ అధ్యక్షుడు మల్లక్ సురేష్ కుమార్ బీఆర్ఎస్ జెండాను ఎగరవేసి బీఆర్ఎస్ నాయకులు వరంగల్ సభకు తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దమందడి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి మాట్లాడుతూ... మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు పెద్దమందడి మండలం నుండి దాదాపు 1000 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభిమానులు సభకు వెళుతున్నట్టు ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను, వైఫల్యాలను కెసిఆర్ ఈ సభలో ఎండగట్టబోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలకు నోచుకోలేదని కెసిఆర్ సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ఉద్యమ పార్టీగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి రఘుపతి రెడ్డి, గ్రామ అధ్యక్షుడు మల్లక్ సురేష్ కుమార్,  గ్రామ రైతుబంధు అధ్యక్షులు రఘువరన్ రెడ్డి, మాజీ ఎఎంసి మాజీ డైరెక్టర్ ఖజా హుస్సేన్, సీనియర్ నాయకులు చిత్తూరు కృష్ణారెడ్డి, సాంబ యాదయ్య, అశోక్ (చిట్టి), యాదయ్య, కుమార్, పార్టీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రెండో విడత ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు రెండో విడత ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు
హాసన్ పర్తి, డిసెంబర్ 14(తెలంగాణ ముచ్చట్లు) రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా హసన్ పర్తి మండలంలోని గ్రామపంచాయితీలలో కొత్తపల్లి సర్పంచిగా దండ్రి సాంబయ్య,అర్వపళ్లి సర్పంచ్ గా...
ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు... 
అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం నగరాభివృద్ధికి చర్యలు.... 
ప్రశాంతంగా ముగిసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా.
చిల్కానగర్ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించిన కార్పొరేటర్ బన్నాల
జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి