కార్మికుల 5వ రోజు నిరసన  సంఘీభావంతో ధర్నాకు చేరుకున్న సీపీఐ నాయకత్వం

సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి కె. నారాయణ 

కార్మికుల 5వ రోజు నిరసన  సంఘీభావంతో ధర్నాకు చేరుకున్న సీపీఐ నాయకత్వం

నాచారం, డిసెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు)

నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ ఎక్స్‌పోర్ట్స్ గార్మెంట్స్ లిమిటెడ్‌లో మహిళా కార్మికులు చేపట్టిన నిరసన ధర్నా 5వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి కె. నారాయణ నిరసన స్థలానికి వచ్చి కార్మికులకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు.కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చూపుతుందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మహిళా కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను తీర్చాలని నారాయణ డిమాండ్ చేశారు. “తక్షణమే పరిష్కారం చూపకపోతే యాజమాన్యాన్ని తాట తీస్తాం” అని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ. నరసింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.ఎస్. బోస్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, జిల్లా నేతలు దామోదర్ రెడ్డి, ధర్మేంద్ర, రచ్చకిషన్, సీపీఐ ఉప్పల్ మండల కార్యదర్శి టి. సత్యప్రసాద్‌తో పాటు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.సీపీఐ నేత నారాయణ రాకతో లేబర్ శాఖ కూడా స్పందించిందిWhatsApp Image 2025-12-12 at 7.41.02 PM ధర్నా స్థలానికి వచ్చిన శ్యాంసుందర్ జాజుల, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, కార్మికులతో మాట్లాడి షాహీ ఎక్స్‌పోర్ట్స్ జీఎం మురళి వారం రోజుల గడువు కోరుతూ లిఖితపూర్వక వివరణ ఇచ్చారని తెలిపారు.వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించనట్టయితే లేబర్ ఆఫీస్‌కు అధికారిక ఫిర్యాదు ఇచ్చి, తదుపరి ఆందోళనను కొనసాగించవచ్చని ఆయన మహిళా కార్మికులకు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!