జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
సమాచారశాఖ మంత్రికి టీడబ్ల్యుజెఎఫ్ వినతి పత్రం అందజేత
హైదరాబాద్, నవంబర్ 29 (తెలంగాణ ముచ్చట్లు)
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాల్సిందిగా సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ టీడబ్ల్యుజెఎఫ్, హెచ్ యు జె ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు.అక్రిడిటేషన్ కార్డులు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ, ఇళ్ల స్థలాల మంజూరు వంటి కీలక అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా టీడబ్ల్యుజెఎఫ్ ప్రతినిధుల బృందం ఐ అండ్ పిఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్ జగన్‌లను కూడా కలిసి వినతులు సమర్పించింది.ఇప్పటికే ఇటీవల రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు ఇదే అంశాలపై వినతి పత్రాలు అందజేసినట్టు నాయకులు తెలిపారు. ఈ క్రమంలో నగరంలోని ఐ అండ్ పిఆర్ అధికారులకు కూడా విజ్ఞప్తులు అందజేశారు.ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజెఎఫ్ సీనియర్ ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ పిల్లి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, రాజశేఖర్, హాష్మీ తదితరులు పాల్గొన్నారు


Comments