పాలేరులో కాంగ్రెస్ జోరు... 

20కి బీఆర్ఎస్ కుటుంబాలు హస్తం గూటికి

పాలేరులో కాంగ్రెస్ జోరు... 

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 2, తెలంగాణ ముచ్చట్లు;

గ్రామ పంచాయతీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పాలేరు నియోజకవర్గ రాజకీయాలు మరింత వేడెక్కాయి.  ఈ క్రమంలో అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి  ఖమ్మం రూరల్‌, కూసుమంచి మండలాల నుంచి  ఇరవై కుటుంబాలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో మంగళవారం చేరాయి. 

- తీర్థాల నుంచి 10 కుటుంబాల చేరిక
ఖమ్మం రూరల్‌ మండలం తీర్థాల గ్రామానికి చెందిన పది కుటుంబాలు  బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నాయి. బోడా వెంకన్న ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. చేరిన వారిలో భూక్యా బాస్‌ నాయక్‌, భూక్యా మోతిలాల్‌, సీతల అనంతరాములు, సీతల వీరన్న, సీతల నాగరాజు, సీతల శంకర్‌, భూక్యా బాస్‌, తేజావత్‌ శివ, తేజావత్‌ సురేష్‌ తదితరులు ఉన్నారు. వీరికి ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు.

మంగళిబండ తండా నుంచి ఉప సర్పంచ్‌ సహా...
అదేవిధంగా కూసుమంచి మండలం మంగళితండా నుంచి కూడా బీఆర్‌ఎస్‌కు చెందిన ఉప సర్పంచ్‌ తేజావత్‌ బాలకృష్ణ సహా మరో పది కుటుంబాలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకొన్నారు. తేజావత్‌ సుబాస్‌, తేజావత్‌ నరేష్‌, బానోత్‌ శ్రీను, తేజావత్‌ శోభన్‌, తేజావత్‌ కృష్ణ, తేజావత్‌ గోపి, బానోతు సింహాద్రి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి కూడా క్యాంపు కార్యాలయంలో  తుంబూరు దయాకర్‌ రెడ్డి వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తేజావత్‌ వెంకట్‌, తేజావత్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .