సీపీఎం అభ్యర్థులను గెలిపించండి: మోరంపూడి పాండురంగారావు
సత్తుపల్లి, డిసెంబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలు పార్టీలకు అతీతంగా గెలిపించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం వేంసూరులోని ఎర్ర రామయ్య భవనంలో ఎలిగినేని రామారావు అధ్యక్షతన జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన,
ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే, కేరళ తరహా సుపరిపాలన మరియు పేదరిక నిర్మూలన కార్యక్రమాలు గ్రామస్థాయి నుంచే అమలు కావాలంటే కమ్యూనిస్టు ప్రతినిధులు గెలవడం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే సీపీఎం అభ్యర్థులను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశంలో పాల్గొన్న వారు:మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్‌రావు, మండల కమిటీ సభ్యులు మల్లూరు చంద్రశేఖర్, మోరంపూడి వెంకటేశ్వరరావు,సీనియర్నాయకులు కొత్తా సత్యనారాయణ, అర్వపల్లి వెంకటేశ్వరరావు, డంకర శ్రీను, కొత్తా అప్పారావు, ఎండిమందల వెంకటేశ్వరరావు, గడిపర్తి మోహన్‌రావు, ఎలిగినేని రాంబాబు తదితరులు.


Comments