శ్రీ గ్లోబల్ హైస్కూల్ నాగులవంచలో ఘనంగా స్పోకెన్ ఇంగ్లీష్ డే....
ఆకట్టుకున్న విద్యార్థుల వివిధ రకాల స్పోకెన్ ఇంగ్లీష్ యాక్టివిటీలు...
ఖమ్మం బ్యూరో, నవంబర్ 29, తెలంగాణ ముచ్చట్లు;
చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గ్లోబల్ హైస్కూల్ నాగులవంచ విద్యాలయంలో స్పోకెన్ ఇంగ్లీష్ డే ను ఘనంగా జరుపుకోవడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది విద్యార్థుల్లో ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించడానికి పాఠశాలలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం అని విద్యార్థులందరూ ప్రతిరోజు ఇంగ్లీషులో మాట్లాడేలా ప్రత్యేకమైన బోధనలను అవలంబించాలని, ఇంగ్లీషు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల ఇంగ్లీష్ ఆక్టివిటీలు అయినా కథలు చెప్పడం, సంభాషణలు, ప్రసంగాలు, పద క్రీడలు వంటి కార్యక్రమాలు నిర్వహించి వారిలో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యంగా మాట్లాడేలా విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు ప్రేరేపించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉచ్చరణ, పదసంపద పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుందని వారు వివరించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.


Comments