నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
నాగారం, డిసెంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు)
ఫీడర్ నిర్వహణ మరియు పీఎంఐ పనుల కారణంగా నాగారం సబ్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనున్నట్లు కీసర విద్యుత్ ఏఈ ఎస్. మురళీ కృష్ణ తెలిపారు.ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు 11 కె.వి బండ్లగూడ ఫీడర్‌కు సంబంధించిన కె ఎస్ ఆర్ టౌన్‌షిప్, అరుంధతి కాలనీ, గౌరీ ప్రియా నగర్, సాయి రత్న కాలనీ, ప్రజాసాయి గార్డెన్ మెయిన్ రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ నిలిపి వేయబడుతుంది.మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు 11 కె.వి కరీంగూడ ఫీడర్ (రాంపల్లి) పరిధిలోని కరీంగూడ గ్రామం, శిల్పా వెంచర్, తారక ఎన్‌క్లేవ్, కాకతీయ ఎన్‌క్లేవ్, శుభకర ఎన్‌క్లేవ్, అక్షయ ఎన్‌క్లేవ్, సాహితీ హర హర, లోటస్ కౌంటీ, సాయి కాలనీ, చంద్రా ఎన్‌క్లేవ్, రాజి రెడ్డి ఎన్‌క్లేవ్, మైత్రి సిటీ, నా కాలనీ, భగవాన్‌క్షాల్ నగర్ కాలనీ, నీలగిరి ఎస్టేట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుతుంది.పనులు పూర్తయ్యాక వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.


Comments