వేలేరు మండలంలోని క్లస్టర్లలో బందోబస్త్ ఏర్పాటు
వేలేరు, 29 నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు రేపు జరుగనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఖచ్చితంగా పరిశీలించేందుకు పోలీసులు ముందడుగు వేశారు. ధర్మసాగర్ సిఐ శ్రీధర్, వేలేరు ఎస్సై సురేష్ సంయుక్తంగా మండలంలోని అన్ని క్లస్టర్లను పర్యటించారు.
నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అనుచిత ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రతి గ్రామంలో తగిన పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయాలని అధికారులు సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. గ్రామాల్లో వచ్చే అభ్యర్థులు, కార్యకర్తలు నియమాలు పాటించేలా అవగాహన కల్పించడంతో పాటు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడానికి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అదనంగా, క్లస్టర్ వారీగా సిబ్బంది నియామకాలు, పహారా బృందాలు, రవాణా సదుపాయాలు తదితర అంశాలపై సమీక్ష జరిపినట్లు పోలీసులు తెలిపారు. రేపటి నామినేషన్ ప్రక్రియలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు


Comments