పిల్లల భద్రతే పాఠశాలల మొదటి బాధ్యత  సీపీసీఆర్ ఛైర్మన్ సీత దయాకర్

పిల్లల భద్రతే పాఠశాలల మొదటి బాధ్యత  సీపీసీఆర్ ఛైర్మన్ సీత దయాకర్

మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ని ప్రతి పాఠశాలలో పిల్లల భద్రత, వారి రక్షణ అత్యంత ప్రాముఖ్యతతో పరిగణించాల్సిన అంశమని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (సీపీసీఆర్) ఛైర్మన్ సీత దయాకర్ అన్నారు. విద్యనందించడం వ్యాపారం కాదు, బాధ్యతగా స్వీకరించాలి. పిల్లలను అన్ని కోణాల్లో కాపాడటం పాఠశాల యాజమాన్యాల ప్రధాన బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ సభగృహంలో, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ స్కూళ్స్” కార్యక్రమంలో ఆమె చందన, సరిత, డీఈఓ విజయకుమారి తదితర సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఇటీవల చోటుచేసుకున్న చిన్నారులపై జరిగే ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా మొత్తం మీద కఠినమైన చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ప్రత్యేక అవగాహన, కౌన్సిలింగ్, పిల్లలకు కౌన్సిలర్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, వాహన భద్రతా చర్యలు, పొక్సో చట్టంపై అవగాహన వంటి అంశాలపై పైలట్ ప్రాజెక్టుగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.పాఠశాలల్లో పిల్లల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన అన్ని సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని ఆమె సూచించారు. “మన ఇంట్లో పిల్లల పట్ల ఉన్న బాధ్యతంతా పాఠశాలల్లో కూడా ఉండాలి. సంఘటనలు జరిగిన తరువాత చర్యలకన్నా ముందస్తు నివారణ చర్యలే ముఖ్యము” అని పేర్కొన్నారు.పిల్లల శారీరిక మానసికాభివృ ద్ధికి ఆటస్థలాలు, గ్రౌండ్లలో శారీరక శ్రమ చాలా అవసరమని ఆమె గుర్తుచేశారు. అలాగే పిల్లలకు సంబంధించిన చట్టాలపై పాఠశాల సిబ్బందంతా అవగాహన కలిగి, చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో కమిటీలను ఏర్పాటు చేసి నెలకోసారి సమావేశమై సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని సూచించారు.జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ, పిల్లల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావు ఉండకూడదని, టీచర్లు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే ముఖ్య గురువులని అన్నారు.WhatsApp Image 2025-12-02 at 8.20.46 PMపాఠశాల యాజమాన్యాలు సూచించిన సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్