ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.
హసన్ పర్తి ఎసై దేవేందర్.
Views: 7
On
హసన్ పర్తి, నవంబర్ 29 ( తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో ఇన్స్పెక్టర్ చేరాలు ఆదేశాల మేరకు ఎస్సై దేవేందర్ ఆయా గ్రామాల్లోని వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలతో శనివారం రోజున సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఓటు హక్కు అమూల్యమైనదని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంతటి వారైనా ఎన్నికల నియమాలని విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments