భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి ...

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి ...

ఖమ్మం బ్యూరో, నవంబర్ 29, తెలంగాణ ముచ్చట్లు;

ఖమ్మం నగరంలో సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికగా ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రం ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. 
శనివారం భక్త రామదాసు కళాక్షేత్రాన్ని మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించారు. కళాక్షేత్రం మొత్తం కలియతిరుగుతూ చేయవలసిన పనులను పరిశీలించారు. కళా క్షేత్రంలో చేపట్టవలసిన ఆధునీకరణ పనులపై టాప్ ప్రూఫ్ లీకేజీ, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్, పార్కింగ్, కలర్ వాష్, పరిసరాలలో పచ్చదనం కోసం మొక్కల పెంపు, నిర్వాహణ, మరమ్మత్తు పనులపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ కళలకు, కళాకారులకు పుట్టినిల్లయిన ఖమ్మం జిల్లాలో ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆధునీకరించి, మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తరామదాసు కళాక్షేత్రం ఆకర్షణీయంగా తయారు చేయడం, సౌండ్, ఆడియో వ్యవస్థను మెరుగు పర్చడం, పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటుకు చర్యలు, గోడలకు సంప్రదాయక వాల్ పెయిటింగ్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, టాప్ ప్రూఫ్ వాటర్ లీకేజీ, కళాక్షేత్రం బయట పరిసరాల్లో గ్రీనరికి చర్యలు, పూర్తి స్థాయి మరమ్మత్తు పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా తయారు చేయడం, కళాక్షేత్రంలో ఏసి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, వెనుక ఉన్న ప్రేక్షకులకు డయాస్ స్పష్టంగా కనిపించేలా రూపొందిచాలని అన్నారు. కళాక్షేత్రం సౌండ్ ప్రూఫ్, లోపల ఆడియో మైక్ వ్యవస్థ పక్కాగా ఉండేలా చూడాలని తెలిపారు. ముందు సీట్లలో కూర్చునే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా స్టేజీ ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు తయారుచేసిన మోడల్ డిజైన్ మ్యాప్ లు, ఆర్కిటెక్చర్ రూపొందించి నమూనా వీడియోను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట జెడ్పి సీఈఓ దీక్షా రైనా, పంచాయతీరాజ్ ఇఇ మహేష్ బాబు, మున్సిపల్ డిప్యూటీ కమీషనర్ శ్రీనివాస్, అసిస్టెంట్ కమీషనర్ అనిల్, ఖమ్మం అర్బన్ తహసీల్దారు సైదులు,  మునిసిపల్ డిఇ ధరణి కుమార్, ట్లౌన్ ఫ్లానింగ్ అధికారి సంతోష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.IMG-20251129-WA0046

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్