లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎంపీ కడియం కావ్య

లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎంపీ కడియం కావ్య

హన్మకొండ,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు): 

హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 11 మందికి రూ. 6 లక్షల 25 వేల విలువైన చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం ప్రభుత్వానికి ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని, అనేక వేలాది పేద–మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం జీవనాధారంగా మారిందని తెలిపారు. అర్హులైన ప్రతి వ్యక్తి ఈ పథకాన్ని వినియోగించుకొని ప్రయోజనం పొందాలని సూచించారు.

అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సీఎం సహాయం చేరేలా కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు. లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు సీఎం సహాయనిధి అందేలా కృషి చేసినందుకు ఎంపీ కడియం కావ్యకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.IMG-20251120-WA0208

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .