ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 21, తెలంగాణ ముచ్చట్లు;
ప్రపంచ మత్య్సకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో ముదిరాజ్ మత్య్స సహకార సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకరవాయి సహకార సంఘం చీప్ ప్రమోటర్ తవడబోయిన కృష్ణ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మత్స్యకారులకు అండగా ఉండడంతో మత్స్యకారులు చేపల పెంపకంలో ముందడుగులో ఉన్నారన్నారు.
సంఘం అభివృద్ధి, మత్స్య కారుల సంక్షే మానికి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను వివరించారు.మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు.సంఘం నాయకులు ఐక్యంగా ఉండి వృత్తిని కొనసాగించుకోవాలన్నారు. ముదిరాజ్‌లు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ మత్స్య అభివృద్ధి కోసం తెలంగాణ మత్స్య కోఆపరేటివ్ ఫెడరేషన్కు వెంటనే ఎన్నికలు జరిపి చైర్మన్ మరియు పాలక మండలిని నియమించాలన్నారు. గ్రామ మరియు జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్నారు. తెలంగాణ మత్స్య శాఖకు 3వేల కోట్ల రూపాయలు కేటాయించి వివిధ పథకాల ద్వారా మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలన్నారు. మత్య్సకారుల భరోసా కార్యక్రమం ప్రారంభించి ప్రతి సొసైటీకి ఉచిత చేప పిల్లల బదులుగా నగదు బదిలీ చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలోమత్స్యకార సంఘ మాజీ సర్పంచ్ మోర బిక్షం, తవడబోయిన సైదులు, తవడబోయిన కృష్ణ, మోర మల్సూర్,మోర శశి తదితరులు పాల్గొన్నారు..


Comments