రోడ్ల విస్తరణలో తొలగించిన బస్టాప్‌లు తిరిగి ఏర్పాటు చేయాలి

మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం బిజెపి నాయకులు

రోడ్ల విస్తరణలో తొలగించిన బస్టాప్‌లు తిరిగి ఏర్పాటు చేయాలి

నాగారం, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల విస్తరణ పనుల కారణంగా తొలగించిన బస్టాప్‌లను తిరిగి పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. రాంపల్లి, ఆర్‌ఎల్ నగర్, ఎస్‌వీ నగర్, దమ్మాయిగూడ రోడ్లలో బస్టాప్‌ల తొలగింపుతో ప్రజలు తీవ్ర అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.నాగారం మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ జెడ్పీటీసీ సభ్యులు మునిగంటి సురేష్ మాట్లాడుతూ, రాబోయే ఎండాకాలంలో మహిళలు, వృద్ధులు, రోగులు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తొలగించిన అదే ప్రాంతాల్లో బస్టాప్‌లను వెంటనే పునర్నిర్మించాలని మున్సిపాలిటీని కోరారు.అదేవిధంగా, బస్టాప్‌లు లేకపోవడంతో ప్రజలు సరైన బస్టాప్ పాయింట్లను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఫ్లెక్స్ బోర్డుల ద్వారా బస్టాప్ సూచనలు ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బిజా శ్రీనివాస్ గౌడ్, బొమ్మిడి బుచ్చిరెడ్డి, నక్క కిషోర్ గౌడ్, అంకర్ల శ్రీనివాస్, మామిడి జంగారెడ్డి, పోతంశెట్టి వెంకటేశ్వర రావు, సూర్యశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వల్లాల శ్రీనివాస్ గౌడ్, ఎలసాని నాగరాజు యాదవ్, జూపల్లి నరేష్, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, వినయ్ రెడ్డి, వెంకటచారి, శ్రీకాంత్ యాదవ్, మధు గౌడ్‌తో పాటు ఎస్‌వీ నగర్ కాలనీ నివాసులు పాల్గొన్నారు.IMG-20251120-WA0171

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్