ఖమ్మంలో 108 సిబ్బందికి నైపుణ్య శిక్షణ.!
- ప్రాణాలను కాపాడే యోధులకు కొత్త పాఠాలు.
- శిక్షణ పొందిన సభ్యులకు సర్టిఫికెట్లు అందజేత.
సత్తుపల్లి, డిసెంబర్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే 108 సిబ్బందికి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు నెలలకు ఒకసారి ఇచ్చే ప్రత్యేక శిక్షణా తరగతులు ఘనంగా ముగిశాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ఈ.ఎం.టీలు, పైలెట్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు.
ఈ తరగతుల్లో ఈ.ఎం.టీలు గడ్డం దీప్తి (అశ్వరావుపేట), దుర్గాభవాని (చండ్రుగొండ), సాకిరీ రమేష్ (దమ్మపేట), గొల్లమందల కృష్ణ (సత్తుపల్లి), కళాధర్ రావు (అన్నపురెడ్డిపల్లి), కాకర్ల మాధవరావు, పింగుల కృష్ణయ్య పాల్గొన్నారు.
పైలెట్ విభాగం నుంచి పి. రాజా, కోండ్రు రవి, షేక్ సైదా, కటారి ప్రభాకర్ హాజరయ్యారు.
ఈ తరగతుల్లో సి పి ఆర్, యాక్సిడెంట్ కేసుల నిర్వహణ, గర్భిణీల అత్యవసర సేవలు, ట్రామా కేర్ వంటి కీలక అంశాలపై నిపుణులు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తయ్యాక అందరికీ సర్టిఫికెట్‌లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఈ.ఎం.ఈ అవులూరి దుర్గాప్రసాద్, మనోహర్, సతీష్, మూడు జిల్లాలకు పర్యవేక్షణ చేస్తున్న ప్రోగ్రామ్ మేనేజర్ పాటి శివకుమార్, శిక్షణ అందించిన పార్వతమ్మ, మహేష్ పాల్గొన్నారు. శిక్షణా బృందానికి సహాయకుడిగా సత్తుపల్లికి చెందిన ఈ.ఎం.టి. గొల్లమందల కృష్ణ పనిచేసి కార్యక్రమం విజయవంతం అయ్యేలా తోడ్పడ్డారు.


Comments