24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు.... 

24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు.... 

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం బ్యూరో, నవంబర్ -29, తెలంగాణ ముచ్చట్లు ;

ఖమ్మం నగరంలో 24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
మంత్రివర్యులు, శనివారం ఖమ్మం నగరం 35వ డివిజన్ లో పర్యటించి 50.25 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ నగరంలో చేపట్టే అభివృద్ధి పనులు నాలుగు కాలాల పాటు స్థిరంగా ఉండే విధంగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. కార్పొరేటర్లు, ప్రజలు మున్సిపల్ కమీషనర్ కు సహకరిస్తూ పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చూడాలని అన్నారు.   అమృత్ పథకం క్రింద ఖమ్మం మున్సిపాలిటీకి 220 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు కూర్చొని చేపట్టాల్సిన పనుల యొక్క డిపిఆర్ తయారు చేయాలని అన్నారు. డిసెంబర్ నెలలో అమృత్ పనులకు టెండర్ పిలిచి రాబోయే వేసవి కాలం నాటికి పనులు పూర్తి చేయాలని, నగర వ్యాప్తంగా 24 గంటల పాటు త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో డ్రైయిన్ నిర్మాణం కోసం మరో 200 కోట్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. 
ఖమ్మం ఖిల్లాకు రోప్ వే సౌకర్యం కల్పించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని, లకారం ప్రక్కన శిల్పారామం నిర్మిస్తున్నామని, వెలుగు మట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి చర్యలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్