కాకర్లపల్లి జడ్పీ హైస్కూల్‌లో బాలహక్కుల వారోత్సవాలు.

కాకర్లపల్లి జడ్పీ హైస్కూల్‌లో బాలహక్కుల వారోత్సవాలు.

సత్తుపల్లి, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

మండల పరిధిలోని కాకర్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాల భాగంగా 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అనంతరం పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు.

సిడిపిఓ మెహర్ ఉన్నిసా మాట్లాడుతూ, పిల్లలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని, పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సూచించారు. మంచి–చెడును తెలుసుకుని సమాజంలో మంచినీ గ్రహించే అలవాటు పెంపొందించుకోవాలని, ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో చర్చించే సంస్కారం ఉండాలని ఆమె విద్యార్థులను కోరారు.

కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి, కాకర్లపల్లి పంచాయతీ పరిధిలోని అంగన్వాడి సిబ్బంది, పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .