దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం

కాంగ్రెస్ మాజీ గ్రామ అధ్యక్షుడు సాతురి ప్రభాకర్ బీజేపీలో చేరిక

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం

ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు) 

ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సాతురి ప్రభాకర్ భారతీయ జనతా పార్టీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సాతురి ప్రభాకర్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గ్రామ అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ చేస్తున్న కృషి, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు తనను ఆకట్టుకోవడంతోనే పార్టీలో చేరినట్లు ప్రభాకర్ తెలిపారు.

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపడేందుకు ప్రభాకర్ చేరిక కీలక పాత్ర పోషించనుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. దామెర గ్రామంలో బీజేపీ శక్తివిస్తరణకు ఇది పెద్ద అవకాశమని వారు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో దామెర శక్తికేంద్ర ఇంచార్జ్ ఠాకూర్ శామ్ సింగ్, మాజీ సర్పంచ్ చల్ల రవీందర్ రెడ్డి, మండల మాజీ ఉపాధ్యక్షులు అంబీర్ శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్