శీర్షిక మౌన నేస్తాలు 

శీర్షిక మౌన నేస్తాలు 

శీర్షిక మౌన నేస్తాలు 
భగ భగ మండుటెండలో జడువక మనకు
చల్లని నీడతో స్వాగతమిచ్చె చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు అని తెలుసుకోని
మొక్కలను నాటు నాటించు
బడిపిల్లలకు బెంచిలై,బడిపంతులకు కుర్చీలై
ప్రేమతో వారిని బరువనక మోసే
చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు అని
తెలుసుకోని, మొక్కలను నాటు, నాటించు
వృద్ధాప్యములో పెద్దకొడుకువోలే చేతికర్రై
సేవలందించే చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు అని తెలుసుకోని, మొక్కలను నాటు నాటించు
దివ్య ఔషధాలు అందించి మహమ్మా రిజబ్బులను నయం చేసే చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు అని తెలుసుకోని మొక్కలను నాటు నాటించు
విందు వినోదాల్లో మధుర ఫలాలు అందించి
నీకు పేరు పఖ్ర్యా తలు తీసుకవచ్చే చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు అని తెలుసుకోని మొక్కలను నాటు నాటించు
సకాలంలో వర్షాలు అందించి రైతన్నల పాలిట
కల్పవృక్షమైనిలిచే చెట్లు మన చుట్టూ ఉన్న
 మౌన నేస్తాలు అని తెలుసుకోని
మొక్కలను నాటు నాటించు
మన పుట్టుక నుండిగిట్టేవరకు కష్టసుఖాల్లో పాలుపంచుకుంటు మన మనుగడకు
జీవనాధారం నిలిచే చెట్లు మన చుట్టూ
ఉన్న మౌన నేస్తాలు అని తెలుసుకోని
మొక్కలను నాటు నాటించు

రచన మంజుల పత్తిపాటి
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ 
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్