థీమ్ పార్క్‌లో క్రీడా సదుపాయాల అభివృద్ధి చేయాలని కార్పొరేటర్‌కు వాకర్స్ క్లబ్ విజ్ఞప్తి
Views: 3
On
మల్లాపూర్, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
మల్లాపూర్ కలర్స్ థీమ్ పార్క్‌లో క్రీడా సదుపాయాలను అభివృద్ధి చేయాలని వాకర్స్ క్లబ్ సభ్యులు కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డిని వార్డు కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు.పార్క్‌లో నిరుపయోగంగా ఉన్న షటిల్ కోర్టును పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావాలని, ఇందుకోసం బ్యాడ్మింటన్ పోల్స్ మరియు నెట్లు ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. అదనంగా పార్క్ అభివృద్ధికి అవసరమైన క్రీడా సామగ్రి మరియు ఓపెన్ జిమ్ పరికరాలను కూడా ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో వాకర్స్ క్లబ్ సభ్యులు ఫైల్స్ ప్రవీణ్, శ్రీనివాస్ దేవ్, భూమండ్ల శ్రీశైలం, మెండ రఘు, చిగుళ్ల మల్లేష్, రాపోలు శ్రీనివాస్ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments