చెకుముకి టాలెంట్ టెస్టులో శ్రీ గ్లోబల్ హైస్కూల్ విద్యార్థులకు మండలం మొదటి స్థానం

చెకుముకి టాలెంట్ టెస్టులో శ్రీ గ్లోబల్ హైస్కూల్ విద్యార్థులకు మండలం మొదటి స్థానం

ఖమ్మం బ్యూరో, నవంబర్ 21, తెలంగాణ ముచ్చట్లు;

చింతకాని మండలంలో శుక్రవారం జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో చింతకాని మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ ను నిర్వహించడం జరిగింది. ఈ చెకుముకి టాలెంట్ టెస్ట్ లో భాగంగా విద్యార్థుల్లో ప్రతిభా వికాసాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో నిర్వహించిన ఈ చెకుముకి టాలెంట్ టెస్ట్ లో గ్లోబల్ హైస్కూల్ కు చెందిన విద్యార్థులు పగడాల కోటి నేహాల్, భీమ పంగి అభిషేక్, గార్లపాటి సుశాంత్ తమ ప్రతిభను ప్రదర్శించి మండలంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి చింతకాని మండల ఎంఈఓ రామారావు విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యాభివృద్ధికి ఇలాంటి పోటీ పరీక్షలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. అదేవిధంగా చింతకాని మండలంలో ఉన్న ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.అనంతరం మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్న విద్యార్థిని విద్యార్థులకు షీల్డ్ మరియు ప్రశంస పత్రాలు అందించడం. జరిగింది. చింతకాని మండలంలో నిర్వహించినటువంటి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో అత్యంత ప్రతిభను ఘనపరిచిన విద్యార్థులను శ్రీ గ్లోబల్ హైస్కూల్ నాగులవంచ యాజమాన్యం మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్