ప్రశాంత్ నగర్ రైల్వే స్టేషన్ ప్రతిపాదనపై రైల్వే అధికారుల స్థల పరిశీలించినారు
నిర్మాణానికి ఆశలు పెరిగిన ప్రజలు
మల్కాజ్గిరి , నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు)
ప్రశాంత్ నగర్ ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్మాణం సాధ్యాసాధ్యా లపై రైల్వే శాఖ కదలికలు మొదలయ్యాయి. గత నెల సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవకు లెవెల్ క్రాసింగ్ నెంబర్ 2టీ వద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని సబర్బన్ ట్రైన్ ట్రావెలర్స్ అసోసియేషన్ సభ్యులు నూర్, పి. భరద్వాజ్ వినతి పత్రం సమర్పించారు. వినతిపై స్పందించిన రైల్వే అధికారులు స్టేషన్ నిర్మాణా నికి అనువైన స్థల ఎంపిక కోసం కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎల్లయ్యతో కూడిన బృందాన్ని పంపించారు. ఈ సర్వేలో డిఆర్యుసిసి సభ్యులు నూర్, భరద్వాజ్‌తో పాటు ప్రశాంత్ నగర్ కాలనీ జనరల్ సెక్రటరీ ఎన్. సత్యమూర్తి, వెంకట సుబ్బయ్య మరియు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.స్థల పరిశీలన పూర్తయ్యడంతో ప్రశాంత్ నగర్ రైల్వే స్టేషన్ నిర్మాణంపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Comments