వెల్దూర్ గ్రామంలో రైతు సంబరాలు 

సీఎం - మంత్రి- ఎమ్మెల్యే  చిత్రపటాలకు పాలాభిషేకం

వెల్దూర్ గ్రామంలో రైతు సంబరాలు 

వనపర్తి, నవంబర్ 22 :(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్దూర్ గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం, ధాన్యంపై క్వింటాల్కు రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో జమ కావడంతో గ్రామ వ్యాప్తంగా సంబరాలు చోటుచేసుకున్నాయి.ఈ నేపథ్యంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు జి. ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి చిత్రపటాలకు గ్రామ రైతులు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. గ్రామస్తులు హర్షధ్వానాలు చేస్తూ.. ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్. జగదీశ్వర్ రెడ్డి (బంగ్లా బాబు) మాట్లాడుతూ..రైతు పక్షపాతి ప్రభుత్వం ఏది ఉన్నా, రైతు రాజు అనే ధ్యేయంతోనే ముందుకు సాగేది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లో జమ కావడం రైతుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు జి. ప్రేమ్ సాగర్, కాంగ్రెస్ నాయకులు ఆర్. జగదీశ్వర్ రెడ్డి, ఎం. నాగిరెడ్డి, దయ్యాల దాసు, మాజీ సర్పంచ్ కుర్వ బాల్‌చంద్రయ్య, ఉప్పరి రామచంద్రయ్య, మాజీ ఉపసర్పంచ్ పి. మల్లికార్జున్, పట్నం సత్యన్న, జియల్ అనంతరెడ్డి, వడ్డే శేఖర్, కుమ్మరి బాలస్వామి, కురువ బొడ్డన్న, మద్దూరి వెంకటయ్య, ఈ. పెద్ద నాగరాజు గౌడ్, నవీన్, డి. నాగన్న, లాలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్