సత్తుపల్లిలో కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం
- పట్టణ రవాణా క్రమబద్ధతకు పెద్దపీట.
- ఎమ్మెల్యే మట్టా రాగమయి.
సత్తుపల్లి, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ సిగ్నల్స్‌కు ఎమ్మెల్యే మట్టా రాగమయి సోమవారం కొబ్బరికాయ కొట్టి సిగ్నల్స్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే బోసుబొమ్మ సెంటర్, పాత బస్టాండ్ ప్రాంతాల్లో వీటిని మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధి–రవాణా క్రమబద్ధత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, సిగ్నల్ వ్యవస్థ అమలుతో వాహనాల రద్దీ తగ్గి ప్రమాదాలు తగ్గేందుకు దోహదం అవుతుందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ, సీఐ శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు గాదె చెన్నారావు, కాంగ్రెస్ నాయకులు పింగళి సామ్యూల్, కమల్ పాషా, ఐ. శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ జీవన్ కుమార్, దోమ ఆనంద్ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ సత్తు, మాజీ వైస్ చైర్మన్ తోట సుజల రాణి, రజక సంఘం అధ్యక్షుడు విరివాడ భూషణం తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో సిగ్నల్స్ అమలు వాహనాల కదలికను మరింత సజావుగా మార్చి, రోడ్డు భద్రతను పెంచే దిశగా ఉపయోగపడనుంది.


Comments