విధుల్లో మానవత్వం చాటిన ఎస్సై సురేష్
Views: 9
On
వేలేరు, 02డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొంటూ వేలేరు ఎస్సై సురేశ్ మానవత్వాన్ని చాటుకున్నారు. మల్లికుదుర్ల గ్రామంలో నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సమయంలో ఓ మహిళ చిన్నారితో కలిసి నామినేషన్ వేయడానికి రావడం గమనించిన ఎస్సై సురేశ్, ఆమె ఇబ్బందిని గుర్తించి చిన్న పాపను తన చేతుల్లోకి తీసుకుని ఆలింగనం చేస్తూ కాసేపు ప్రేమగా ఆడించారు.
సాధారణంగా కఠినంగా కనిపించే పోలీసు అధికారులు ఇలా ఆప్యాయతతో వ్యవహరించడంతో అక్కడున్న ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments