సీఎంఆర్ఎఫ్ పెండింగ్ చెక్కుల వివరాలు సేకరిస్తున్న: ఎమ్మెల్యే జారె
Views: 7
On
అశ్వారావుపేట, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఇవ్వాల్సిన పెండింగ్‌లో ఉన్న చెక్కుల వివరాలను హైదరాబాద్ సెక్రటేరియట్‌లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించారు.
ఎవరెవరి చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయో, ఏ దశలో ఫైళ్లు ఉన్నాయో, వెంటనే విడుదల కావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి కోసం అర్హులు చేసిన అన్ని దరఖాస్తులు త్వరగా మంజూరు అయ్యేలా స్వయంగా అనుసరిస్తున్నట్టు తెలిపారు. పెండింగ్ చెక్కులుత్వరలోనే ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments