ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వజ్రేష్ యాదవ్
నాగారం, డిసెంబర్ 01 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ 5వ వార్డ్ శ్రీనివాస్ నగర్ కాలనీలో నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ పూజా కార్యక్రమం నేడు ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించారు.పేద కుటుంబాలకు గృహ సదుపాయాలు అందించడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వజ్రేష్ యాదవ్ ప్రశంసిస్తూ, ముందునాళ్లలో మరింత మంది అర్హులైన కుటుంబాలకు ఇండ్లు అందేలా కృషి చేస్తామని వెల్లడించారు.ఈకార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఛైర్మెన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments