ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.

కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్మన్ లక్ష్మారెడ్డి.

ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.

సత్తుపల్లి, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రతి విద్యార్థిలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్మన్ లక్ష్మారెడ్డి అన్నారు. భవిష్యత్ తరాలకు కలుషితం లేని ప్రకృతిని అందించేందుకు ఇప్పుడే చర్యలు ప్రారంభించాలన్నారు.

స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, నాబార్డ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న యంగ్ ఎర్త్ లీడర్స్ కార్యక్రమంలో భాగంగా మెడిసన్ గార్డెన్, కిచెన్ గార్డెన్, వాటర్ హార్వెస్టింగ్ పిట్, కంపోస్ట్ పిట్, జనరల్ ప్లాంటేషన్ ప్రారంభోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస చారి, ఏయంఓ ప్రభాకర్ రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్మన్ లక్ష్మారెడ్డి, యంగ్ ఎర్త్ లీడర్స్ రాష్ట్ర కోఆర్డినేటర్ యానాల వెంకట్ రెడ్డి, సత్తుపల్లి మండల విద్యాధికారి ఎన్. రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడిన వారు పేర్కొంటూ,
“మా తరం వారు కలుషితం లేని ప్రకృతిని చూశాం. కానీ నేటి పరిస్థితుల్లో భూమి, నీరు, గాలి, చివరికి మనం తినే ఆహారం కూడా కలుషితమై ప్రజల ప్రాణాలు తీసేస్తున్నాయి. నేటి బాలలే రేపటి పౌరులు. మంచి ప్రకృతిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది” అని విద్యార్థులకు సూచించారు.

ప్రతి విద్యార్థి తమ పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్క నాటి, ఇక సంవత్సరం తర్వాత మొక్కకు కూడా పుట్టినరోజు జరుపుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అలాగే ప్రతి రక్షాబంధన్ రోజున ‘వృక్షాబంధన్’ చేసి, ఒక చెట్టును కుటుంబ సభ్యుడిగా గుర్తించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మెడిసన్ గార్డెన్, కిచెన్ గార్డెన్, వాటర్ హార్వెస్టింగ్ పిట్, కంపోస్ట్ పిట్, జనరల్ ప్లాంటేషన్‌ల వినియోగాలు, ప్రాధాన్యతను పిల్లలకు వివరించారు.

కార్యక్రమంలో పుడమి సంపాదకులు రమేష్‌రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. నాగేశ్వరరావు, మెంటార్ టీచర్ శ్రీదేవి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, ఎర్త్ లీడర్స్, సిజీఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.IMG-20251119-WA0221

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!