జూబ్లీహిల్స్ ఫలితాలతో సత్తుపల్లి కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు.

కష్టఫలంతో మట్టా దయానంద్ ఆనందం.

జూబ్లీహిల్స్ ఫలితాలతో సత్తుపల్లి కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు.

సత్తుపల్లి, నవంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ విజయ్‌కుమార్ శుక్రవారం స్థానిక క్యాంప్‌ఆఫీస్‌లో కార్యకర్తలతో కలిసి విజయోత్సవాల్లో పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్–వెంగళరావు నగర్ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహించిన మట్టా దయానంద్ మాట్లాడుతూ, పది రౌండ్ల కౌంటింగ్‌లో తొమ్మిది రౌండ్లపాటు కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగడం ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. మొదటి రెండు రౌండ్ల నుంచే కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం రావడం, కేవలం మూడో రౌండ్‌లో మాత్రమే బీఆర్‌ఎస్ స్వల్ప ఆధిక్యం సాధించిందని పేర్కొన్నారు.

తాను ఇంచార్జ్‌గా చూసుకున్న పరిధిలోని అన్ని బూత్‌లలోనూ కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ ఫలితం కార్యకర్తల కష్టపాటు, క్రమశిక్షణ, నిబద్ధతకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

రేవంత్ రెడ్డి సర్కార్ పథకాలు ప్రజల్లో మంచి స్పందన తెచ్చుకోవడం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర నాయకుల కృషి ఈ విజయంలో కీలకపాత్ర పోషించిందని దయానంద్ పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై భారీ తేడాతో నవీన్ యాదవ్ గెలుపొందడం, ప్రజలు కాంగ్రెస్‌పై చూపిన నమ్మకానికి ప్రతీకగా ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, గాదె చెన్నారావు, కమల్ పాషా, ఐ. శ్రీనివాసరావు, ఎర్ర సత్యం, శివ వేణు, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!