కాప్రా చెరువు వద్ద శానిటేషన్ సిబ్బంది కార్తీక దీపోత్సవం

కాప్రా చెరువు వద్ద శానిటేషన్ సిబ్బంది కార్తీక దీపోత్సవం

కాప్రా, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):


WhatsApp Image 2025-11-17 at 8.25.05 PMకార్తీక మాసం చివరి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో కాప్రా చెరువు వద్ద కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చెరువు ప్రాంగణం దీపాలతో కళకళలాడింది.ఈ సందర్భంగా శానిటేషన్ సూపర్‌వైజర్ సుదర్శన్ మాట్లాడుతూ పూర్వకాలంలో ఋషులు వాతావరణ మార్పుల కారణంగా వ్యాధులు రాకుండా దీపాలు వెలిగించేవారని, దీపాల వెలుగు పరిసరాల్లో క్రిమికీటకాలను తగ్గిస్తుందని పురాణాల్లో ఉన్న విశ్వాసాన్ని వివరించారు. పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఎక్కువ రోగాలు వ్యాపిస్తున్నాయని, ప్రజలు చెత్తను రోడ్లపై లేదా ఖాళీ స్థలాల్లో వేయకుండా జీహెచ్ఎంసీ ఆటోలు, రిక్షాలను వినియోగించాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో డీసీ జగన్, డీ.ఎస్‌.డబ్ల్యు.ఎం. గోపాల్, ఏ.ఎం.ఓ.హెచ్. మధుసూదన్, రాంకీ సూపర్‌వైజర్ నవీన్ రెడ్డి, ఎస్‌.ఎఫ్‌.ఏలు, శానిటేషన్ జవాన్లు, డ్రైవర్లు మరియు ఇతర పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .