సీసీ రోడ్డు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల

సీసీ రోడ్డు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల

చిల్కానగర్, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన్‌ లో సుమారు 56 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ శనివారం పర్యవేక్షించారు. జిహెచ్ఎంసి అధికారులు, బ్యాంక్ కాలనీ మరియు రాఘవేంద్ర నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ, సీసీ రోడ్డు నిర్మాణ సమయం లో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారుల నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, నిర్మాణ పనుల వల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాణ్యతలో లోపాలు తలెత్తితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఈఈ హరిలాల్, డిఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎద్దుల కొండల్ కోకొండ, కోకొండ జగన్, పల్లె వేణు గౌడ్, బాలకృష్ణ గౌడ్, శ్యామ్, బంటి గౌడ్, చిన్న, బ్యాంక్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు గఫూర్, జనరల్ సెక్రటరీ సందీప్ భూషణ్, వెంకటేశ్వరరావు, బాలా గౌడ్, రాఘవేంద్ర నగర్ అసోసియేషన్ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, సభ్యులు రవి వర్మ, కృష్ణారెడ్డి, భాస్కరరావు, సత్యనారాయణ, గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .