సర్పంచులు లేక దిక్కుతోచని స్థితిలో గ్రామాలు
స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం పట్ల ప్రజల్లో అసహనం
వనపర్తి,నవంబర్05( తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఆలస్యం కావడం ప్రజా హక్కుల ఉల్లంఘనగా మారింది. సర్పంచులు లేకపోవడంతో గ్రామల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ప్రజల సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి బాధ్యతగల వ్యక్తి లేని పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో కాలయాపన చేస్తూ ప్రజలను గాలికి వదిలేసింది. తమ రాజకీయ లాభనష్టాలను దృష్టిలో ఉంచుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూల సమయాన్ని ఎదురుచూస్తూ ఎన్నికలను వాయిదా వేస్తోంది. ఈ తీరుతో ప్రజల్లో ఆ పార్టీపై ఉన్న నమ్మకం దెబ్బతింటోంది.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా నిలిచిపోవడంతో గ్రామాలు సమస్యలతో విలవిలలాడుతున్నాయి. తాగునీరు, రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు మన సమస్య ఎవరికీ చెప్పుకోవాలి? అని నిరాశ చెందుతున్నారు.
రాజకీయ వర్గాల్లోనూ ఆసంతృప్తి వెల్లువెత్తుతోంది. గ్రామాల లో అభివృద్ధి లేక ప్రజల్లో అసహనం పెరుగుతుంది.సొంత పార్టీ ఎమ్మెల్యేలే గ్రామాలలోతిరగలేకపోతున్నామని, గ్రామల అభివృద్ధి సంగతి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది..jpeg)
పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరపాలని చట్టం చెప్పినా, రెండు సంవత్సరాలు గడిచినా చర్యలు కనిపించడం లేదు. ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై గట్టిగా స్పందించకపోవడంతో ప్రజల్లో రాజకీయ వ్యవస్థపట్ల విసుగు పెరుగుతోంది.
ప్రజాస్వామ్యానికి మూలం అయిన ఎన్నికలు జరగకపోతే ప్రజా నమ్మకం దెబ్బతింటుంది. ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించాలనీ ప్రజలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.


Comments