భగీరథ మహర్షి విగ్రహావిష్కరణలో పాల్గొన్న వెల్టూర్ సగర సంగం
పెద్దమందడి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్టూర్ గ్రామ సగర సంగం తరపున సగర ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, సగర సంగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్, జిల్లా సగర సంగం అధ్యక్షులు మోడల్ తిరుపతయ్య సాగర్, అలాగే రాష్ట్ర, జిల్లా స్థాయి సగర సంగం నాయకులు హాజరయ్యారు.
మండల సగర సంగం అధ్యక్షుడు దిండు చంద్రశేఖర్ సాగర్ మాట్లాడుతూ..ఈ విగ్రహావిష్కరణలో వెల్టూర్ సాగర సంగం ప్రతినిధుల పాల్గొనడం మా గ్రామానికి గర్వకారణం. భగీరథ మహర్షి ఆచరణలు మా సంఘానికి దారిదీర్పుగా నిలుస్తాయి అని తెలిపారు.
అనంతరం సగర సంగం నాయకులు దిండు చంద్రశేఖర్ సాగర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,పూజారి రామచంద్రయ్య, దిండు బాలస్వామి, అన్నెల వెంకటయ్య, వేముల దస్తగిరి, వేముల నాగన్న, బంగారి బాలస్వామి, బంగారి శ్రీనివాసులు, దిండు నాగరాజు (మిల్లర్), ఆంజనేయులు, పూజారి అంజి, దిండు రవీందర్ సాగర్, దిండు శివానంద సాగర్, గుంటి ప్రేమ్ సాగర్, దిండు ఉదయ సాగర్, దిండు చిన్న రాజు, అన్నెల బాలు సాగర్, బంగారు కృష్ణయ్య, దిండు రాంసాగర్, దిండుకృష్ణ సాగర్, వేముల బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


Comments