తిరుపతి కుటుంబానికి శ్రీ చైతన్య స్కూల్ చేయూత.
బస్ క్లీనర్ కుటుంబానికి రూ.45 వేల ఆర్థిక సాయం.
Views: 319
On
భీమదేవరపల్లి, ఆగస్టు 09 (తెలంగాణ ముచ్చట్లు):
శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఇందిరానగర్‌లో బస్ క్లీనర్‌గా పనిచేసిన గణబోయిన తిరుపతి అకస్మాత్తుగా గుండెనొప్పితో మృతి చెందారు. అందరితో ఆప్యాయంగా మెలిగే తిరుపతి ఇక లేరన్న వార్త విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని తీవ్రంగా కలచివేసింది. ఆయన మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
ఈ నేపథ్యంలో తిరుపతి కుటుంబానికి అండగా నిలిచిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం తమ వంతు సహాయంగా రూ.45 వేల ఆర్థిక సాయాన్ని అందించింది. కుటుంబానికి అండగా నిలిచి, ఆపద సమయంలో మానవత్వాన్ని చాటిన యాజమాన్యాన్ని పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యం ,ఏజీఎం పద్మాకర్, ప్రిన్సిపల్ బండారి సంపత్, గ్లోబల్ ఐజిన్ చైర్మన్ వెలగ సునీల్ కుమార్, ప్రకాష్, ఉపాధ్యాయులు, తోటి డ్రైవర్లు, క్లీనర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
09 Aug 2026 20:11:44
* ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలతో కలిసి పోరాటం
* కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్
జమ్మికుంట టౌన్ ఆగస్టు 09 (తెలంగాణ...


Comments