మిత్రుడి మృతితో విషాదం.. కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు.

మిత్రుడి మృతితో విషాదం.. కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు.

ప్రసాద్ కుటుంబానికి రూ.35 వేల ఆర్థిక సాయం అందించిన 1988–89 బ్యాచ్ మిత్రులు

భీమదేవరపల్లి, జూలై 23 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన పోగుల ప్రసాద్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన 1988–89 బ్యాచ్‌కు చెందిన చిన్ననాటి స్నేహితులు తమ ఆత్మీయ మిత్రుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రసాద్ మృతి ఆయన కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న స్నేహితులుమానవత్వాన్ని చాటుతూ ఆయన కుటుంబానికి తమ వంతు సహాయంగా రూ.35 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ మొత్తాన్ని ప్రసాద్ భార్య అరుణ, కుమారులు అరుణ్, అజిత్‌లకు అందజేసి, భవిష్యత్తులో కూడా తమ స్నేహితులందరి తరఫున కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాశిరెడ్డి ఆదిరెడ్డి, గౌడ చంద్రబాబు, మామిడాల చంద్రశేఖర్, కడారి మొగిలి, నల్లగొండ శంకర్, మాడుగుల రవీందర్, చిట్కూరి వెంకటస్వామి తదితర చిన్ననాటి మిత్రులు పాల్గొన్నారు. వారి ఈ ఆప్యాయ సహకారం గ్రామస్థుల ప్రశంసలు అందుకుంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

మిత్రుడి మృతితో విషాదం.. కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు. మిత్రుడి మృతితో విషాదం.. కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు.
ప్రసాద్ కుటుంబానికి రూ.35 వేల ఆర్థిక సాయం అందించిన 1988–89 బ్యాచ్ మిత్రులు భీమదేవరపల్లి, జూలై 23 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం...
నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థుల ఉద్యమాలను అణచివేయడం దారుణం.
కొత్తకోటలో 233వ బూత్‌కు వంద శాతం మార్కు.
నీట్ పేపర్ లీక్‌పై వేలేరులో కాంగ్రెస్ ఆందోళన .
నీట్ పేపర్ లీక్‌పై ధర్మసాగర్‌లో కాంగ్రెస్ నాయకుల నిరసన.
హుజురాబాద్‌లో సెంట్రల్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం.
ఆరుతడి పంటల సాగుతో నష్టాలను నివారించండి.