చింతకాని మండలంలో ఓటరు నమోదు పై సమీక్ష సమావేశాలు.
ఖమ్మం బ్యూరో , జూలై 22(తెలంగాణ ముచ్చట్లు )
చింతకాని మండలంలోని గాంధీనగర్, బొప్పారం గ్రామాల్లో ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు పార్టీ జిల్లా నాయకుడు మంకెన రమేష్ హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా గ్రామస్థాయిలో ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కొత్తగా అర్హత పొందిన వారు, ఇప్పటి వరకు పేరు నమోదు కాని వారు ఎవరూ మిగలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలందరూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు అయ్యేలా అవగాహన కల్పించాలని అన్నారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని, గ్రామస్థాయిలో పనిచేసే బాధ్యులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బొడ్డు వెంకట రామారావు, బొప్పారం గ్రామ సర్పంచ్ రహీముతుల్లా, మాజీ సర్పంచ్ ఎస్.కే. సిలార్ సాబ్, కాలింగ్ డేవిడ్, తునికిపాటి పూర్ణచంద్రరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు మాజీ చెలికేసి వెంకటేశ్వర్లు, బత్తుల కొండలు, మేకల ప్రసాద్, గురుజాల సంజీవరావు, చలవాది లక్ష్మణ్, లింగం అశోక్, ఎస్.కే. జావిద్, యాదా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Comments