ముల్కనూరులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి..
నలుగురు అరెస్ట్, నగదు-మొబైళ్లు స్వాధీనం.
Views: 0
On
భీమదేవరపల్లి, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు):
ముల్కనూర్ గ్రామంలో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ముల్కనూర్ పోలీసులు పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించగా, మాడుగుల అలెగ్జాండర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
మిగిలిన నలుగురు వ్యక్తులు మాడుగుల ప్రసాద్, మాడుగుల కృష్ణ, గునుకుంట్ల రాజయ్య, మాడుగుల బిషప్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.1,480 నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన నలుగురిని ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై జూద నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ముల్కనూర్ పోలీసులు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
22 Jul 2026 22:00:31
హుజురాబాద్, జూలై 22(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖను...


Comments