పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట.. సత్తుపల్లి సింగరేణిలో 10 వేల మొక్కలు.

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట.. సత్తుపల్లి సింగరేణిలో 10 వేల మొక్కలు.

- జేవీఆర్ ఓసీలో భారీ వృక్షారోపణ కార్యక్రమం.
- హరితాభివృద్ధికి సింగరేణి కట్టుబడి ఉంది.
- జీఎం చింతల శ్రీనివాస్.

సత్తుపల్లి, జూలై 21 (తెలంగాణ ముచ్చట్లు): 

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సింగరేణి సత్తుపల్లి ఏరియా ఆధ్వర్యంలో మంగళవారం భారీ స్థాయిలో వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు. బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సీసీఓ) ఆదేశాలు, సింగరేణి యాజమాన్య సూచనల మేరకు జేవీఆర్ ఓపెన్‌కాస్ట్ (జేవీఆర్ ఓసీ) ప్రాజెక్టు పార్కింగ్ యార్డులో చేపట్టిన **'మాస్ ప్లాంటేషన్ డ్రైవ్'**లో ఏరియా వ్యాప్తంగా 10 వేల మొక్కలను నాటారు. సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు, హరిత విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా, ప్రాజెక్టు అధికారులు, ఫారెస్ట్రీ, పర్యావరణ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్. సుధాకర్, ఐఎన్‌టీయూసీ వైస్‌ ప్రెసిడెంట్ బి. కోటేశ్వరరావు, సీఎంఓఏఐ వైస్‌ ప్రెసిడెంట్ డి. రమేష్‌బాబు తదితర కార్మిక సంఘాల నాయకులు మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో యాజమాన్యానికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని వారు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక కార్యాచరIMG-20260721-WA0010ణ అమలు చేస్తున్నామని, సత్తుపల్లి ఏరియాను మరింత పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News